బన్నీవాస్ అనగానే పవన్ కళ్యాణ్ పాలోవర్ అనే ముద్ర పడిపోతుంది. జనసేన కోసం ఆయన ప్రచారం చేశారు. పార్టీకి కావాల్సినపుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటారని సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఆయన నుంచి ‘కోట బొమ్మాళి పీఎస్’ అనే సినిమా వస్తోంది. ఇది పొలిటికల్ టచ్ వున్న సినిమా.
పొలిటిషన్స్ పోలీసులను ఎలా వాడుకుంటారు? దానివల్ల పోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి ? ఓటు బ్యాంకింగ్ కోసం కులాలను మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు ? ఇలాంటి ఎలిమెంట్స్ తో వుంటుంది. అయితే సినిమా నేపధ్యం ప్రస్తుత రాజకీయాల మీద ఒక సెటైర్ గా ఉంటుదని, బన్నీ వాస్ నుంచి వస్తున్న ఈ సినిమాలో జనసేన వాయిస్ కూడా వినిపించే అవకాశం వుందని కొందరు చెబుతున్నారు. అయితే సినిమా యూనిట్ మాత్రం వీటిని కొట్టిపారేస్తుంది. ఇందులో పొలిటికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఎవరిపై సెటైర్ గా ఉండదని, ఏ పార్టీ వాయిస్ వినిపించదని చెబుతుంది. మరి ‘కోట బొమ్మాళి పీఎస్’ అసలు విషయం ఏమిటో నవంబర్ 24న తెలుస్తుంది.