తెలంగాణలో ఉన్నతి అవినీతి ప్రభుత్వమని.. ఉద్యమకారులు ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణ ఇది కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా.. బీజేపీని గెలిపించాలని ఆయన తొలి సారి ప్రచారసభలో పాల్గొన్నారు. హన్మకొండలో జరిగిన ప్రచారసభలో పవన్ ప్రసంగించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని అంటున్నారని బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఇంత అవినీతి జరగడం దారుణమన్నారు.మొన్ననే పార్టీ మారిన ఒక నాయకుడు బహిరంగంగానే మాట్లాడుతూ తెలంగాణలో 6% నుంచి 8% పర్సంటేజ్ ఇస్తున్నామని నాయకుడు చెప్పడం బాధాకరమని అన్నారు.
ఏపీలో రౌడీలు రాజ్యమేలుతున్నా, గుండాలు బెదిరిస్తున్నా, డబ్బు లేకపోయినా అంతమందిని తట్టుకొని నిలబడుతున్నానంటే, ఏ బలం లేకపోయినా గుండె ధైర్యంతో పోరాటం చేసే స్పూర్తిని తెలంగాణ నుంచే నేర్చుకుంటున్నాను… నా పోరాటానికి తెలంగాణ యువత అండగా ఉంటుందన్నారు. తెలంగాణ అమరవీరులు, పోరాట యోధుల మీద గౌరవం, నాలుగు కోట్ల ప్రజల మీద గౌరవంతో దశాబ్ద కాలం పాటు నోరు విప్పలేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే ప్రధానమంత్రికి, దేశ ఆర్థిక శక్తిని 10వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి పై నాకు ఆపార గౌరవమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రాలో అధికార పార్టీల ప్రశ్నిస్తున్న వాణ్ణి తెలంగాణలో మార్పు కోరుకుంటానన్నారు. బీసీలు ముఖ్యమంత్రి కావాలన్నారు.
బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినన్నారు. జేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. జనసేన – బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు.