ఏపీ పోలీసుల గురించి ఎవరైనా చాలా అథమంగా ఊహించుకుంటే.. మీరు చాలా తప్పు చేస్తున్నారు.. మేము అంత కంటే ఎంతో లోతుగా పాతాళంలోకి దిగిపోయారు. మా అంత ఎదవతనాన్ని అంచనా వేయలేరని నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసేందుకు వడ్డమూడిలోని సంగండెయిరీకి పోలీసులు వెళ్లారు. డెయిరీలోకి రావడానికి అవసరమైన పత్రాలు.. లోపల ఎవరినైనా అదుపులోకి తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని డెయిరీ సిబ్బంది కోరారు.
కానీ పోలీసులు ఆ పత్రాలు తేవడం కన్నా.. బుల్ డోజర్లు తేవడం సులువని.. వాటినే తీసుకొచ్చి గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి అక్కడ ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయాలనుకున్నారు. పోలీసుల తీరు చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ నెల 15న ఏలూరు జిల్లాకు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి తనపై సంగం డెయిరీ సిబ్బంది దాడి చేశారంటూ చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు 14 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అందులో సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు చేర్చారు. అసలు ఆ సమయంలో ఎవరూ లేరు. అయినా పోలీసులు ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. దీనిపై ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నరేంద్ర బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుందని తెలిసి ఉదయమే.. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లారు.
పోలీసులు జేసీబీలతో సంగం డెయిరీ వద్దకు వెళ్లిన కాసేపటికే హైకోర్టు అందరికీ.. ముందస్తు బెయిల్ మంజూర చేసింది. దీంతో పోలీసులు తమ కూల్చివేత పని చేయకుండానే వెనుదిరిగారు. ఇంత ఘోరమైన పోలీసింగ్ ఎక్కడ ఉంటుందని టీడీపీ ప్రశ్నించింది. చట్టం, న్యాయం పాటించని పోలీసులకు మూడు నెలల తర్వాత అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు.