విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్లకు నిప్పు పెట్టిన కేసు క్లోజ్ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు పార్టీ చేసుకుని సిగిరెట్ వెలిగించుకుని విసిరేశారని దాని వల్లే మంటలు వచ్చాయని తేల్చారు. ఇద్దరు వ్యక్తులు బోట్ల నుంచి వెళ్తున్న సీసీ దృశ్యాలను రిలీజ్ చేసి వారితే తప్పని తేల్చారు. అయితే వారు వెళ్లేటప్పటికీ బోటుల్లో మంటలు లేవు. ఎంత సేపటికి మంటలు వచ్చాయో చెప్పలేదు. అదేమైనా టైమ్ బాంబా.. వారు వెళ్లిపోయిన తర్వాత అంటుకోవడానికి అనే డౌట్ పోలీసులకు రాలేదు. ఇతరులకు రాకుండా చేశారు.
బోటు ప్రమాదంపై పోలీసులు హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దర్ని అరెస్టు చేశారు. వారిలో ఒకరు బోటులో వంటలు చేసే వ్యక్తి.. మరొకరు వాచ్మెన్. ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారట. హోటులో ఫిష్ ఫ్రై చేసుకున్నారట. తిని.. తాగారు. తర్వాత సిగరెట్ వెలిగించుకున్నారు. పార్టీ అయిపోయాక వెళ్లిపోయారు. మరి మంటలు ఎప్పుడు వచ్చాయంటే.. అయిపోయిన సిగరెట్ పక్కబోటులోకి విసిరేశారట. వారు వెళ్లిపోయాక మంటలొచ్చాయని పోలీసులు చెబుతున్నారు. వారిద్దర్నీ అరెస్టు చేశారు. సీసీ టీవీ ఫుటేజీ విడుదల చేశారు. వారు వెళ్లిపోతున్న సమయంలో ఏ బోటులోనూ మంటలు లేవు. కనీసం టైమింగ్ కూడా లేదు.
తీవ్రమైన విమర్శలు వస్తూండటంతో చివరికి ఇద్దరిపై కేసు పెట్టి .. అలా జరిగిపోయిందని చెబుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బోటు ప్రమాదం వెనుక చాలా పెద్ద కారణమే ఉందని.. అనుమానిస్తున్నారు. మొదట లోకల్ బాయ్ నాని వీడియోలు తీసి పోస్టు చేయడంతో.. అతని పైనే నెట్టేయాలనుకున్నారు. మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. ఈ లోపు కోర్టుకెళ్లడంతో వదిలేశారు. ఇప్పుడు మరో ఇద్దర్నీ అరెస్టు చేశారు. పోలీసులు కేస్ క్లోజ్ చేయడంతో.. మిస్టరీ ఎప్పటికీ తేలే అవకాశం ఉండదు. ఇంత చేసి.. .చిన్న ఉప్పు చేపదే తప్పన్నట్లుగా పోలీసులు తేల్చడం ఆసక్తికరంగా మారింది.