అర్జున్ రెడ్డి’ సినిమా ముగిసిన వెంటనే… సందీప్ రెడ్డి నుంచి ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే సినిమా రాబోతోందని ప్రచారం జరిగింది. మహేష్ బాబుతో ఈ కథకు సంబంధించిన డిస్కర్షన్స్ కూడా జరిగాయి. కానీ ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తరవాత ‘అర్జున్ రెడ్డి’ హిందీకి వెళ్లడం, ఆ తరవాత ‘యానిమల్’.. అలా ఓ నాలుగేళ్ల పాటు బాలీవుడ్ కే అతుక్కుపోయాడు. ఆ వెంటనే `స్పిరిట్` ఉండనే ఉంది. మరి ‘షుగర్ ఫ్యాక్టరీ’ ఏమైంది? అది ఎప్పుడు బయటకు వస్తుంది?
‘షుగర్ ఫ్యాక్టరీ’ సందీప్ రెడ్డికి అత్యంత ఇష్టమైన స్క్రిప్టుల్లో ఒకటి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కథని సినిమాగా కంటే, వెబ్ సిరీస్ గా తీయడమే బెటర్ అని భావిస్తున్నాడట. ఈ కథ పూర్తిగా `రా`గా ఉంటుందని, సెన్సార్ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దాన్ని వెబ్ కే వదిలేయాలని సందీప్ ఫీలవుతున్నాడని తెలుస్తోంది. అది కూడా ఇప్పట్టో తెవిలే వ్యవహారం కాదు. `యానిమల్` అయిన వెంటనే `స్పిరిట్` రూపొందించాలి. ఈ రెండింటికీ మధ్య అనుకోని గ్యాప్ వస్తే మాత్రం ఓటీటీలో `షుగర్ ఫ్యాక్టరీ` చూడొచ్చు. కాకపోతే మహేష్‌లాంటి అగ్ర హీరోలతో కాకుండా మీడియం రేంజు హీరోలతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే ఛాన్సుంది.