మాజీ జర్నలిస్టు, చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆయననే బూతులు తిట్టే రాజకీయం నేర్చుకున్న కన్నబాబుకు వైసీపీలో రెండున్నరేళ్ల మంత్రి వచ్చింది. ఇప్పుడు ఆయన , ఆయన సోదరుడు ఓ భూవివాదంలో డాక్టర్ ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. డాక్టర్ తల్లి ఉదయం కన్నబాబు, ఆయన సోదరుడిపై తీవ్ర ఆరోపణలు చేసి .. సాయంత్రం మాట మార్చారు. అప్పటికి సెటిల్ చేసుకున్నారేమో కానీ.. జరగాల్సిన డ్యామేజీ మాత్రం జరిగిపోయింది.
కన్నబాబు ఈనాడులో ఓ సాధారణ జర్నలిస్టు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయనకు కనీసం కారు కూడా ఉండేది కాదని ఆయన గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశానికి ఆయన బైక్ పై వెళ్లారు. కానీ ఇప్పుడు ఆయన, ఆయన కుటుంబానికి వందల కోట్లలో ఆస్తులు ఉంటాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన సోదరుడు కల్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు., నాగార్జునే డైరక్టర్ చేసుకున్నారన్నప్రచారం ఉన్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ఆయన డైరక్టర్. తర్వాత ఏ సినిమా కూడా హిట్ లేదు. చిరంజీవితో సినిమా అనుకున్నారు కానీ ఆగిపోయింది.
ఇప్పుడు లిటిగేషన్ లో భూముల్లో వేలు పెట్టి … ఎంతో కొంతకి స్వాహా చేసుకునే వైసీపీ నేతల వ్యాపారాన్ని వీళ్లు కూడా ప్రారంభించారని తాజాగా ఘటనలతో బయటకు వచ్చింది. అటూ ఇటూగా మొత్తం కొట్టేసే ప్రయత్నం చేయడంతో ఆ డాక్టర్ ఆత్మహత్య చేసేసుకున్నాడు. తన తమ్ముడే జాలిపడి.. డబ్బులు ఇచ్చారని ఎమ్మెల్యే కన్నబాబు … చెప్పుకొస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలంతా ఫలానా దందాలు చేయాల్సిందేనని ఆయన కూడా నిరూపిస్తున్నారు.