తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్ళి మొదలు అయింది. చంద్రబాబును అరెస్టు రోజే లోకేశ్ తన యాత్రను పొదలాడలో నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాదయాత్ర జనంలోకి వెళ్లింది. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో లోకేశ్ పాదయాత్ర ముగియనుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని మూడు జిల్లాల్ని కలిపేలా పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అన్న పేరుతో నారా భువనేశ్వరి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు విడుదల కావడంతో మరో జిల్లా పర్యటన ఖరారు కాలేదు. ఇప్పుడు ఆమె పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది. వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది.
చంద్రబాబు రాజకీయ పర్యటనలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఉంటాయని.. భావిస్తున్నాయి. కేసుల మీద కేసులు పెట్టి చంద్రబాబును ప్రచారానికి వెళ్లకుండా చేయాలని జగన్ అండ్ కో పెద్ద కుట్ర పన్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. బెయిల్ ఆంక్షలు 29వ తేదీతో ముగుస్తాయి. అందుకే తర్వాతి రోజు తిరుమల వెళ్లలనుకుంటున్నారు. 30వ తేదీలోపు సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే ఆ తర్వాత చంద్రబాబు కార్యాచరణ భిన్నంగా ఉండే అవకాశం ఉంది.