ఈమధ్య యాక్షన్ సినిమాల్లో పెద్ద పెద్ద మిషన్ గన్లతో హీరోలు శత్రు శంహారానికి పూనుకొంటున్న సీన్లు చూస్తూనే ఉన్నాం. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, ఖైదీ, విక్రమ్, మార్క్ ఆంటోనీ చిత్రాల్లో హీరోలు పెద్ద పెద్ద మిషన్ గన్లు పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయా సినిమాల్లో, యాక్షన్ ఎపిసోడ్లు బాగా ఆకట్టుకొన్నాయి కూడా. ఇప్పుడు యానిమల్ లో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. ట్రైలర్ లో ఆమిషన్ గన్ని కూడా చూపించారు. ఈ మెగా మిషన్ గన్… ఈ సినిమాలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కానుందని సమాచారం. ఈ మిషన్ గ్ని ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా తయారు చేయించారు. దీని ఖరీదు దాదాపు రూ.50 లక్షలు. ప్రస్తుతం ఇది ముంబైలో ఉంది. దీన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కొన్ని థియేటర్లలో ఈ మిషన్ గన్ని ప్రదర్శనార్థం ఉంచాలన్న ఆలోచన కూడా ఉంది. కానీ ట్రావెలింగ్ ఎలా అనేదే.. ఆలోచన.
యానిమల్ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా నిడివి 3 గంటల 21 నిమిషాలన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా పూర్తి నిడివి 3 గంటల 49 నిమిషాలు. ఇంత సుదీర్ఘమైన సినిమా చూడడం కష్టం కాబట్టి, సినిమాని ట్రిమ్ చేశారు. అయితే ఓటీటీలో మాత్రం పూర్తి వెర్షన్ విడుదల చేయబోతున్నార్ట. డిసెంబరు 1న యానిమల్ థియేటర్లలోకి వస్తోంది. మరి ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చూడాలి.