ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డేటా ఎనలిటికల్ యూనిట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏం డేటా ఎనలటిక్స్ చేస్తుందంటే… ఆదాయమంట. ఆదాయం ఎక్కడ తగ్గిపోయిందో గుర్తించి పెంచడానికి ఈ యూనిట్ సలహాలు ఇస్తుందట. మొత్తం అన్ని శాఖలకూ సలహాలు ఇస్తారు కానీ.. ఇప్పటికైతే పూర్తిగా ఆర్థిక శాఖకే పరిమితం చేశారు. దీనికి నడిపించేందుకు సీఎస్ నేతృత్వంలో సలహా కమిటీ, కార్యవర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. సలహా కమిటీ మూడు నెలలకో సారి సమావేశం అవుతుంది.
రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అడ్డగోలుగా నరికేసి.. మద్యం ద్వారా ప్రజల రక్తాన్నిపిండేస్తూ… పెరుగుతున్న ఆదాయం గురించే గొప్పగా చెప్పుకుంటోంది ప్రభుత్వం. ప్రజల్ని మరింత పేదలుగా చేయాలన్న లక్ష్యంతోనే పాలన సాగుతోంది. ఐదేళ్ల కిందట ఎంత ఆదాయం ఉందో.. ఇప్పుడు దాదాపుగా అంతే కాదు. కానీ మద్యం విషయంలో మాత్రం దాదాపుగా ఇరవై వేల కోట్ల ఆదాయం పెరిగింది. అంటే అంత పెద్ద మొత్తంలో ఇతర రంగాల్లో తగ్గిపోయింది. సాధారణంగా పెరిగిన ధరలతో పోలిస్తే.. పన్నుల ఆదాయం భారీగా పెరగాలి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పటి వరకూ తాము చేస్తున్న విధ్వంసం గురించి పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా సలహా కమిటీ ఏర్పాటు చేయడం.. అదీ కూడా మూడు నెలల ముందు ఏర్పాటు చేయడం … అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఈ కమిటీ పేరుతో ఎన్నికల కు సంబంధిచిన పనులు.. చేయిచుకోవడమో లేకపోతే… సలహాదారుల ముసుగులో మరికొందర్ని నియమించి… డబ్బు వ్యవహారాలు చక్క బెట్టుకోవడమో చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ సలహా కమిటీలో సభ్యులు.. వారి విధులపై నిజమైన వివరాలు బయటకు వచ్చినప్పుడే ఈ కమిటీ గురించి అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.