దొంగల్ని, దోపిడీదారుల్ని పక్కన పెట్టుకోవడం వారు దొరికిపోయిన తర్వాత లోకేష్ బినామీ అని.. ..టీడీపీపై నిందలేయడం కామన్. శేఖర్ రెడ్డి దగ్గర నుంచి అదే జరుగుతోంది. తాజాగా బూదాటి లక్ష్మినారాయణ అనే టీటీడీ బోర్డు మాజీ మెంబర్, వైసీపీ నేతల సన్నిహితుడ్ని లోకేష్ కు సన్నిహితుడ్ని చేసేసింది సాక్షి.
ఈ బూదాటి లక్ష్మినారాయణ.. జగన్ రెడ్డి సర్కార్ రాగానే టీటీడీ బోర్డు మెంబరయ్యారు. అత్యంత తీవ్రమైన పోటీ ఉండే టీటీడీ బోర్డులో సభ్యత్వం అంటే .. వైసీపీ పెద్దలకు ఎంత సన్నిహితులో చెప్పాల్సిన పని లేదు. ఆయన హైదరాబాద్ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో పదిహను వందల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసి మోసగించారు. అదే పని.. అమరావతిలోనూ చేశారు. విల్లాలు కట్టిస్తామని డబ్బులు వసూలు చేసి పత్తా లేకుండా పోయారు. దీనిపై పోలీసు కేసులు నమోదయ్యాయి.
వెంటనే సాక్షి పత్రిక.. ఓ కథనం రాసేసింది. ఎక్కడ కూడా ఆయన జగన్ రెడ్డి ప్రియ మిత్రుడని … జగన్ రెడ్డి హయాంలోనే టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారని… మోసాలు బయటపడిన తర్వాతనే తప్పించామని ఎక్కడా చెప్పలేదు. కానీ.. మోసాలు ఇన్ని చేశారని చెప్పి.. లోకేష్ కు గత ఎన్నికల్లో ఆర్థిక సాయం చేశారని అసువుగా రాసేశారు. దీన్ని చూసి లోకేష్ తన సోషల్ మీడియాలో స్పందించారు. నా సన్నిహితుడికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా.. సాక్షి పత్రికు సిగ్గనేది లేదా .. భారతిరెడ్డి గారూ అని ప్రశ్నించారు.
నా సన్నిహితుడికి జగన్ పాలన లో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చారా? ఏమ్మా భారతీ రెడ్డి గారు తప్పుడు సాక్షి పత్రిక కు సిగ్గు అనేది లేదా? పక్క రాష్ట్రాల్లో అక్రమాలకు పాల్పడ్డాడని అరెస్ట్ చేసిన బూదాటి లక్ష్మీనారాయణకు వైసిపి పాలనలో టిటిడి బోర్డు మెంబర్ పదవి ఎలా వచ్చింది? ముడుపులు అందుకోకుండానే బూదాటి లక్ష్మీనారాయణను టిటిడి బోర్డు మెంబర్ చెయ్యాలని కరకట్ట కమల్ హాసన్ సిఫార్సు చేసారా? అని లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
దొంగలంతా వైసీపీలో ఉంటారు. వాళ్లను వాడుకున్నంత కాలం వాడుకుంటారు. వారు దొరికిపోగానే… తమకేం సంబంధం లేదని అనడమే కాదు.. టీడీపీకి అంటగట్టేస్తుంది సాక్షి. అందుకు ఏ మాత్రం సిగ్గుపడరు.