తప్పుడు పనులు చేయడం కోర్టుల చుట్టూతిరగడం అనేది ఏపీసీఐడీ అధికారులకు కామన్ అయిపోయింది. తప్పు చేసిన వాళ్లను కాకుండా తప్పుడు కేసులు పెట్టి రాజకీయ బాసుల లెక్క సెటిల్ చేయాలనుకుంటే.. చివరికి తాము కేసుల్లో ఇరుక్కని.. కోర్టు ధిక్కరణ శిక్షలకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అది కూడా తమ ప్రభుత్వం ఉన్నప్పుడే. తమది కాని ప్రభుత్వం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు కూడా వారి పరిస్థితి ఘోరంగా మారుతోంది.
మార్గదర్శి అంశంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ… ఆ సంస్థ ఎండీ శైలాజా కిరణ్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై కోర్టు ధిక్కరణగానే తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ జరిగినప్పుడల్లా కోటు వేసుకుని సీఐడీ చీఫ్ సంజయ్ తో పాటు దర్యాప్తు అధికారులు, ఏపీ హోంశాఖ కార్యదర్శి గుప్తా తెలంగాణ హైకోర్టుకు వస్తున్నారు. వారి తరపు లాయర్ చెప్పిందే చెబుతున్నారు. ఈమెయిల్ కు సమాధానం ఇవ్వలేదని ముందస్తు జాగ్రత్తగా లుక్ ఔట్ నోటీసు జారీ చేశామన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉంటే ఎలా ఇస్తారంటే.. సమాధానం లేదు.
దీంతో కోర్టు ధిక్కరణ కింద తీర్పును న్యాయమూర్తి ప్రకటించబోతున్న సమయంలో మరోసారి అఫిడవిట్ దాఖలు చేస్తామని వారి తరపు లాయర్ విజ్ఞప్తి చేశారు. క్షమాపణ అడిగుతూ.. ఈ అఫిడవిట్ వేసే అవకాశం ఉంది. కోర్టు ఎలా స్పందిస్తుందో కానీ… క్షమాపణ చెపితే తప్పు చేసినట్లుగా అంగీకచడం. అలా చెప్పకపోతే కోర్టు ధిక్కరణ శిక్షపడుతుంది. ఇప్పుడే సీఐడీ సంజయ్ అండ్ గ్యాంగ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. తర్వాత ఎలా ఉంటుందో మరి