తిరుమల కాలిబాటలో ఓ చిరుత చిన్నారిని చంపేసింది. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు బాధిత కుటుంబానికి మరో ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని టీటీడీని ఆదేశించింది. కానీ తాము ప్రకటించిన పరిహారం మాత్రం ఇచ్చిన టీటీడీ హైకోర్టు ఆదేశాలను బట్టదాఖలు చేసింది. తాజాగా ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తమ ఆదేశాలు పాటించలేదని తెలియడంతో చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఆశ్చర్యపోయింది. అత్యంత ధనవంతమైన టీటీడీ బోర్డు బాధిత కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వలేకపోయిందా అని ప్రశ్నించింది. ప్రాసెస్ లో ఉందని టీటీడీ బోర్డు లాయర్లు చెప్పుకొచ్చారు.
కానీ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దల గుప్పిట్లో ఉండే టీటీడీ పాలకుల వ్యూహం మాత్రం న్యాయవ్యవస్థను.. హైకోర్టును పలుచన చేయడమే టార్గెట్ గా .. వారి ఉత్తర్వుల్ని లైట్ తీసుకున్నారని సులువుగానే గ్రహించవచ్చు. హైకోర్టు చెబితే మేము ఇచ్చేయాలా అన్నది వారి వాదన. హైకోర్టు అంత పవర్ ఫుల్లేం కాదని.. నిరూపించాలని ఏపీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఏ ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. కొన్ని వేల కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడమే దీనికి సాక్ష్యం. ఇప్పుడు టీటీడీ కూడా అంతే. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి ప్రాసెస్ ఏంటి.. అదీ నెలల తరబడి చేస్తారా… అని ఆశ్చర్యపోక తప్పదు. ఇవ్వాలంటే… రాత్రికి రాత్రి ఇచ్చేస్తారు.
న్యాయవ్యవస్థ ఆదేశాలపై పట్టింపు లేదని.. అవసరమైతే కోర్టు ధిక్కారం వేసుకోండని… ప్రభుత్వం బాధితుల్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది . న్యావ్యవస్థ కూడా కఠినంగా ఉండలేకపోవడం వల్ల ఇలాంటి సమస్య వచ్చింది. రేపు వచ్చే ప్రభుత్వాలు… కూడా ఇలాగే వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ ప్రాధాన్యం తగ్గిపోతుంది.త ఈ ప్రభుత్వ పాలకులు క్రిమినల్ బ్రెయిన్ తో ఉన్న వారు.. వారికి చట్టాలు, కోర్టులు అడ్డంగా ఉంటాయి. అందుకే ఏమైనా చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది.