తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నయి. దేశంలో అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే అడ్వాంటేజ్ లభించింది. జాతీయ మీడియాలు చేసిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ వస్తుందని తేల్చాయి. హంగ్ వచ్చే పరిస్థితిని కూడా అంచనా వేశాయి కనీ.. కాంగ్రెస్ పార్టీ మెజార్టీకి రెండు, మూడు సీట్ల దూరంలో ఆగిపోతాయని అంచనా వేశాయి.
అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పదిహేను సీట్ల వరకూ తేడా పడుతోంది. ఆ సీట్లను భర్తీ చేసేలా బీజేపీ లేదా మజ్లిస్ సీట్లను సాధించే అవకాశం లేదు. అందుకే.. ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీపై ప్రజా వ్యతిరేకతను అన్ని పోల్స్ అంచనా వేశాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం కేసీఆర్ కు అతి పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా మైనస్ అయ్యాయి. ఓ ప్రధాన వర్గం బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో వ్యతిరేకమయిందని చెబుతున్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ నినాదం కూడా ఉపయోగపడిందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మూడో తేదీన అసలైన రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకూ ఈ ఎగ్జిట్ పోల్స్ తో .. కాంగ్రెస్ పార్టీ వర్గాలు క్లౌడ్ నైన్ లో ఉంటాయి. బీఆర్ఎస్ వర్గాలు కాస్త నిరాశతో ఉంటాయి అందులో సందేహం లేదు. డిసెంబర్ మూడో తేదీన ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే మాత్రం.. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మరోసారి మంచి దశ ప్రారంభమయినట్లే అనుకోవచ్చు.