సోమవారం కేబినెట్ భేటీకి కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరగనుంది. ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ఆ ధీమాతోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ దక్కకపోతే మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉండదు.
అప్పటికే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయినందున పదవిలో ఉన్న ఎవరైనా రాజీనామా చేస్తారు. అందకే సోమవారం కేబినెట్ భేటీ జరగడం సాధ్యం కాదు. ఒక వేళ రాజీనామా చేయకపోయినా మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం సాధ్యం కాదు. నిజానికి గెలిచినప్పటికీ కేబినెట్ భేటీ అనేది ఎబ్బెట్టుగా ఉంటుంది. కొత్త మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తేనే కరెక్ట్ గా ఉంుంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. క్యాడర్ లో ధైర్యం నింపేందుకు కేసీఆర్, కేీఆర్ ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా మూడో సారి ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులు ఎవరూ కంగారు పడొద్దని.. ఫలితాలు మనకే అనుకూలంగా వస్తాయని చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారంటున్నారు.