సాక్షి పత్రికతో నాకేం సంబంధం అని జగన్ రెడ్డి చెప్పారు.. ఇప్పటికీ చెబుతున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి ఎవరో తెలీదు అని కోర్టుకు చెప్పారు. కానీ ఆయనతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతారు. తప్పుడు పనులు చేసిన వాళ్లు వైసీపీ వాళ్లు అయితే వాళ్తతో మాకేం సంబంధం అని చేసే వాదనలకు అంతే ఉండదు. అమెరికాలో ఉండే ఓ రెడ్డి పశువుల డాక్టర్ .. న్యాయమూర్తుల్ని బూతులు తిట్టి కేసులో ఇరుక్కుంటే.. ఆయనెవరో తెలియని అనేశారు. తర్వాత ఆ డాక్టర్ ఎన్నో సార్లు వైసీపీ నేతలను కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి.
అంతేనా దళితుడ్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును సస్పెండ్ చేశాం.. మాకేం సంబంధం లేదని వాదించారు. కానీ సీఎం జగన్ తో ఆంతరంగిక సమావేశాల్లో ఆయన ఉంటారు. ఇలా తప్పుడు పనులు చేసిన వాళ్లను బయటకు సంబంధం లేదని చెప్పడం.. కామనే. ఇప్పుడు అమెరికాలో అరెస్టయిన సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వైసీపీ నేతతోనూ సంబంధం లేదని వైసీపీ ప్రకటించేసింది. సత్తారు వెంకటేష్ రెడ్డికి వైసీపీ లో లీగల్ సెల్ కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఆయన పొన్నవోలుతో కలిసి చాలా సమావేశాల్లో పాల్గొన్న ఫోటోలు ఉన్నాయి. వైసీపీ కార్యక్రమాలు నిర్వహించిన ఫోటోలు ఉన్నాయి. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ ప్రారంభోత్వంలో జగన్ రెడ్డి పక్కనే ఉన్నారు.
ఇక ఆయన ఇంటర్యూలు.. చూసి అబ్బో వీర ఫ్యానును అనే పాటలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇదంతా కళ్ల ముందు కనబడుతున్నా.. సత్తారు వెకంటేష్ రెడ్డి తో వైసీపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. అయినా ఇలాంటి క్రమినల్స్ ను దగ్గరకు తీసుకుని ప్రోత్సహిస్తారు. బహిరంగంగా హత్తుకుంటారు ఇంత చేస్తున్నా.. అవును మా పార్టీనే అని ఎందుకు అంగీకరించడం లేదన్నది ఎవరికీ అర్థం కాని విషయం. ఒప్పుకుంటే సరిపోతుంది కదా.. కనీసం అబద్దాలు చెబుతున్నారని జనాలు అనుకోకుండా ఉంటారని చెప్పే సలహాదారులు ఎవరూ లేరేమో ?