తెలంగాణ లో రాజకీయ మిత్రుడికి సాయం చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాల్ని.. రాష్ట్ర ఇమేజ్ ను ఘోరంగా నాశనం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు వైసీపీ. సాగర్ డ్యాంను దురాక్రమణ చేసి రాత్రికి రాత్రి గేట్లు ఎత్తి వేసుకుని నీళ్లు వదులుకున్న ఘటనతో కేంద్రం చర్యలు తీసుకుంది. అసలు సాగర్ డ్యాం ప్రాజెక్టు ను పూర్తిగా తన చేతులోకి తీసుకుంది. అక్కడ పోలీసులు ఎవరూ ఉండకుండా.. కేవలం కేంద్ర బలగాలే పహారా కాసేలా నిర్ణయం తీసుకుంది. కేంద్ర చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు అంగీకరించక తప్పని పరిస్థితి. ఇప్పుడు కృష్ణాబోర్డు చెప్పినంత మేర నీళ్లు విడుదల చేస్తారు.
ఎవరికీ సాగర్ డ్యాంపై హక్కులు లేకుండా పోయాయి. మాకు తాగు నీటికి నీళ్లు కావాలని కృష్ణాబోర్డును అడిగి ఉంటే… బోర్డు కావాల్సిన నీటిని కేటాయింపుల ప్రకారం ఇచ్చేది. కానీ కృష్ణాబోర్డును అడగకుండా.. రాత్రికి రాత్రి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసేందుకు వెళ్లినట్లుగా డ్యాం గేట్లు దూకి.. దౌర్జన్యంగా సాగర్ డ్యాంపైకి వెళ్లారు. నీటిని విడుదల చేసుకున్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇజో ఎన్నికల స్టంట్ అని.. నీళ్లలో వాటా ఉంటే.. కేఆర్ఎంబీ ఇవ్వదా అన్న అనుమానాలు వచ్చాయి. కేఆర్ఎంబీ కూడా లేఖ రాసి అదే అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంది. డ్యాం నిర్వహణను కృష్ణాబోర్డుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
డ్యాంపై సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని.. పోలీసులు అక్కర్లేదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏపీ పోలీసులు కూడా ఇప్పుడుబయటకు వెళ్లిపోయారు. ఇక ముంద అక్కడకు వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. ఓ రకంగా డ్యాంపై పూర్తి హక్కులను కేంద్రానికి జగన్ రెడ్డి సర్కార్ కట్టబెట్టింది. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా రాజకీయ అవసరాల కోసం చేసిన పనులతో రాష్ట్ర ప్రయోజనాలకు గండం ఏర్పడింది.