ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్ పార్ట్ 1- సీజ్ఫైర్’ ట్రైలర్ వచ్చేసింది. మూడు నిమిషాల నలభై ఆరు సెకన్ల నిడివి గల ట్రైలర్ లో కథాంశం, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా చాలా అంశాలనే చూపించారు. ‘స్నేహం’ నేపధ్యంలో సాగే కథ ఇది. ”దూరంగా వున్న ఒక ప్రాంతంలో విడదీయలేని ఒక స్నేహం వుండేది” అనే వాయిస్ ఓవర్ తో చిన్ననాటి ఎపిసోడ్ తో ట్రైలర్ మొదలౌతుంది. ఇందులో ప్రభాస్ పేరు దేవ. తన స్నేహితుడి కోసం ‘ఎర అయినా అవుతా సొరైన అవుతా’ అని చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేస్తాడు దేవ.
తర్వాత ట్రైలర్ ని వెయ్యిళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. మొహమ్మద్ గజనీ, చెంఘీజ్ ఖాన్ కంటే క్రూరమైన బందిపోతూ తెగని పరిచయం చేశారు. ఖాన్సార అడవిని కోటగా మలచుకున్న ఆ బందిపోట్లు దానిని ఒక సామ్రాజ్యంగా విస్తరించారు. అక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు జరిగాయి. ఆ సామ్రాజ్యం దొర జపతిబాబు తన కొడుకుని తర్వాత దొరగా చూడాలని అనుకుంటాడు. ఈ క్రమంలో నారంగ్, గురుంగ్ అనే రెండు వర్గాలు తెరపైకి వస్తాయి. ఇరు వర్గాలు విదేశాల నుంచి సైన్యాలు తెప్పించుకుంటారు. అప్పుడు… సరిగ్గా ట్రైలర్ సెకండ్ హాఫ్ లో ఒక ఆర్మీగా రంగంలో దిగుతాడు దేవ(ప్రభాస్) ఇక అక్కడి న ఉంచి యుద్ధం మొదలౌతుంది.
ట్రైలర్ లో సలార్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ కథ ఎక్కడ? ఎందుకు జరుగుతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం జరిగింది. దాదాపుగా ప్రధాన పాత్రలన్నీ రివిల్ చేశారు. ప్రభాస్ మార్క్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ పుష్కలంగా వున్నాయి. కేజీఎఫ్ తరహాలో సలార్ బ్లాక్ వరల్డ్ లో జరిగే కథ. ట్రైలర్ మొత్తం నలుపుతో నిండిపోయింది. లార్జర్ దెన్ లైఫ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. ప్రభాస్ వైల్డ్ మోడ్ లో కనిపించారు. పృద్విరాజ్ సుకుమార్ కీలక పాత్రలో కనిపించాడు. శ్రుతి హాసన్ ని ఒక ఫ్రేం కి పరిమితం చేశారు. ఈశ్వరీరావు కూడా కీలకంగా కనిపించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్, నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ ఉన్నతస్థాయిలో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సలార్ పై అంచనాలు ఇంకా పెంచింది.