తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు. కేవలం మూడు నెలల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి పదో తేదీ కి రెండు రోజులు అటూ ఇటూగా ,షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 లో ఏపీలో జమిలీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగాయి.
2019 మార్చి పదో తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీకి మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్ లో పోలింగ్ పూర్తయింది. అయితే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి… జూన్ లో ఆ ప్రక్రియ జరిగింది. కానీ ఎన్నికల షెడ్యూల్ మ మార్చి మొదట్లోనే ప్రకటించారు. అప్పట్నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది.
అంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా వంద రోజులు మాత్రమే ఉందనుకోవాలి. చంద్రబాబును ఎన్నికలకు దూరం చేసేందుకు అడ్డగోలుగా కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ చెల్లుతాయో లేదో సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. ప్రతిపక్షాలపై ఎన్నో క్రమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కానీ.. ఏపీలోనూ ఎన్నికల వేడి పెరుగుతోంది.