దళితుడైన డ్రైవర్ ను హత్య చేసి ఆయన ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు పూర్తిగా హంతకుడు అయిన ఎమ్మెల్సీ వైపే ఉంటున్నారని కనీసం దర్యాప్తు చేయడం లేదని.. కేసు నమోదు చేసి ఖాళీగా కూర్చున్నారని దళిత డ్రైవర్ తల్లిదండ్రులు కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ వేశారు.
విచారణలో పోలీసుల అనేక తప్పిదాలు వెలుగు చూశాయి. అలాంటి మర్డర్ ఒక్కడే చేయలేడని.. కేవలం ఎమ్మెల్సీ అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారు. కానీ సీసీటీవీ ఫుటేజీలో ఆయన భార్య సహకారం కూడా ఉన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమెను నిందితురాలిగా చేర్చకపోవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. పోలీసులు విచారణ సరిగా చేయలేదని… సీసీటీవీ ఫుటేజ్ వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అధికార పార్టీలో ఉన్నందున ఉన్నత స్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారని .. సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో సీబీఐ విచారణ అక్కర్లేదని రాష్ట్ర పోలీసులు విచారణ ఇచ్చారు. చివరికి హైకోర్టు సీబీఐ విచారణకు నిరాకరించింది. అనంతబాబుపై విచారణ ఇక జరగదు.. జరిగినా… ఏదో కారణంతో వాయిదాలు వేసుకుంటూ పోతారని భావిస్తున్నారు. దీంతో ఆయన సేఫ్ గా బయటపడినట్లేనని.. అంచనా వేస్తున్నారు. దళిత డ్రైవర్ ను చంపేసినా దిలాసాగా ఉండటం ఆయనకే సాధ్యమని సెటైర్లు వినిపిస్తున్నాయి.