ఏపీ ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చేది లేదు కానీ ఆ పేరుతో ముందుగా భూసేకరణ చేసి రైతుల్ని నట్టేట ముంచుతోంది. ఈ సారి పుంగనూరు మీద పడ్డారు. పుంగనూరులో పెప్పర్ మోషన్ అనే సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల ఫ్యాక్టరీ పెడజతామని భూములివ్వాలని అడగడంతో పుంగనూరులో రైతుల మీద పడ్డారు. వ్యవసాయ భూముల్ని తీసుకుని ఆ కంపెనీకి ఇచ్చేందుకు సిదద్ధమయ్యారు. అంత ఆసక్తి ఏమిటో కానీ వైసీపీ నేతలు ఈ దందాలో ముందున్నారు. ప్రభుత్వం భూములు కొట్టేయడానికే ఎన్నికలకు ముందు డ్రామాలాడుతోందని రైతులు నమ్ముతున్నారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తరవాత చాలా కంపెనీలకు భూముల ుఇచ్చారు. వీర బస్సుల ఫ్యాక్టరీ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తామని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు తయారు చేసుకునే పరిశ్రమ అడిగితే….అనంతపురం జిల్లాలో 120 ఎకరాల భూమి కేటాయిస్తున్నామని గతంలో ప్రకటించారు. భూములిచ్చారో లేదో .. అసలు పరిశ్రమ మాత్రం ఇప్పటి వరకూ అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత మేఘా కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన ఒలెక్ట్రా బస్సుల ఫ్యాక్టరీ అని హడావుడి చేశారు. సైలెంట్ గా భూములిచ్చారేమో కానీ ఆ కంపెనీ పత్తా లేదు. ఇప్పుడు పెప్పర్ మోషన్ అనే కంపెనీ పేరుతో హడావడి చేస్తున్నారు.
ఇంటలిజెంట్ ఫుట్వేర్ సెజ్ పేరుతో నాలుగేళ్ల కిందటే చిత్తూరు జిల్లాలోనే ఆరు వందల ఎకరాలు కేటాయిస్తామని ప్రకటించారు. పశువుల వ్యాక్సిన్స్ తయారు చేస్తమని వస్తే.. పులివెందులలో యాభై ఎకరాలు కేటాయించారు. అవన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు పెప్పర్ మోషన్ పేరుతో మరోసారి పుంగనూరులో భూదందా చేస్తున్నారు.