నారా లోకేష్ యువగళం పాదయాత్రను 17వ తేదీన భీమిలిలో ముగించేలా నిర్ణయించారు. ఆ రోజున భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ హాజరవుతారు. జనసేన, టీడీపీ అగ్రనేతలు పాల్గొనే మొదటి ఉమ్మడి సభ కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ జనసమీకరణతో ఉత్తరాంధ్రలో బలాన్ని చాటేలా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. ఆయనే విశాఖ జిల్లాలో లోకేష్ పాదయాత్ర విషయంలో .. బహిరంగసభ విషయంలో లీడ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నతలందరికీ ఉమ్మడి బాధ్యతలిచ్చినా గంటా … మరింత చొరవ తీసుకుంటున్నారు. జనసేనతో కలిసినందున ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామన్న నమ్మకంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా పాదయాత్ర రేంజ్ ఉండాలని డిసైడయ్యార.ు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలోనే వచ్చే అవకాశం ఉంది. అంటే… ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం శ్రీకాకుళం వరకూ పాదయాత్ర చేస్తే మరో పదిహేను రోజులు పడుతుంది. కానీ ఎన్నికల సన్నాహాలకు సమయం సరిపోతు కాబట్టి… లోకేష్… భీమిలీతో ముగించాలనుకుంటున్నారు.