జగన్ రెడ్డిపై క్రిస్టియన్లలోనూ మార్పు వచ్చినట్లుగా వైసీపీ వర్గాలకు అర్థమైపోయింది. అందుకే జగన్ ను కాదనుకోవద్దంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. క్రైస్తవ కూటములకు వెళ్లి రాజకీయ ప్రచారం చేస్తున్నారు. అక్కడ నేతలు మాట్లాడిన మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. ఓ క్రైస్తవ కూటమిలో కాకినా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. జగన్ రెడ్డి నిఖార్సైన క్రైస్తవుడని.. ఆయననే నమ్ముకోవాలని కోరారు. ఆయన సీఎంగా ఉంటేనే మనమంతా బలంగా ఉంటామని చెప్పుకొచ్చారు. ద్వారంపూడి మాటలు విన్న వారు… జగన్ రెడ్డిని క్రైస్తవులు కూడా నమ్మడం లేదని వారే ఓ అంచనాకు వచ్చారని అందుకే ఇలా బతిమాలుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
క్రైస్తవులు.. ముఖ్యంగా కన్వర్టడ్ క్రిస్టియన్లను జగన్ కు ఓటు బ్యాంకుగా చేయడంలో గతంలో షర్మిల భర్త .. మత ప్రచార కర్త అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. చర్చిలపై ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో ఆయన జగన్ రెడ్డి కోసం పని చేయడానికి సిద్ధంగా లేరు. పైగా ఆయనకు వ్యతిరేకంగా సందేశం ఇస్తున్నారని చర్చిల్లో ప్రచారం జరుగుతోంది. క్రైస్తవ ఓటర్లలో పది శాతం మార్పు వచ్చినా ఓటు బ్యాంక్‌కు భారీగా గండి పడుతుంది. వైసీపీ నేతలు క్రైస్తవ కూటములకు వెళ్లి జగన్ కోసం ప్రచారం చేస్తున్నారంటున్నారు.
అయితే వీరి ప్రచారం కాస్త తేడాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రైస్తవుడే సీఎంగా ఉండాలా అని.. ఇతర వర్గాలు ఆలోచించే పరిస్థితి వస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మత మార్పిడులు పెరిగిపోయాయి. ఈ పరిణామాలు.. వైసీపీ నేతలు చేస్తున్న బహిరంగ క్రైస్తవ సంతుష్టీకరణ ప్రకటనలతో … ఇతర వర్గాలన్నీ దూరమయ్యే అవకాశం లేదు. పాలనలో ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోవడంతో క్రైస్తవ మైనార్టీలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది