తొలి సినిమాకే ఐకానిక్ పాత్ర దొరకడం చాలా అరుదు. అలాంటి అరుదైన పాత్ర మృణాల్ ఠాకూర్ దక్కింది. ‘సీతారామం’తో సీతగా ప్రేక్షకుల గుర్తుపెట్టుకునే పాత్ర చేసింది. ఇప్పుడు ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ విడుదలకు సిద్ధమౌతోంది. నాని హీరో తెరకెక్కిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా డిసెంబర్ 7న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా మృణాల్ ఠాకూర్ మీడియా చిట్ చాట్ లో హాయ్ నాన్న విశేషాలు పంచుకుంది
హాయ్ .. మృణాల్ గారు
-హాయ్ అండీ
హాయ్ నాన్న డాడీ ఎమోషన్ మూవీ కదా.. ముందు మీ నాన్నగారి మీకున్న బాండింగ్ గురించి చెప్పండి?
-నా జీవితానికి స్ఫూర్తి నాన్న. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే. డాడీ ఈజ్ మై బిగ్గెస్ట్ పిల్లర్.
సీతారామం తర్వాత వస్తున్న సినిమా ఇది.. ఎలా అనిపిస్తుంది?
– సీతారామం తర్వాత ప్రేక్షకుల్లో ఖచ్చితంగా అంచనాలు వుంటాయి. అందుకే కథల విషయంలో చాలా పర్టిక్యులర్ గా వున్నాను. ‘హాయ్ నాన్న’ చాలా మంచి కథ. తెరపై విరాజ్, యష్ణ ప్రయాణాన్ని చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా వారితో ప్రేమలో పడిపోతారు. ఆ నమ్మకం ఐతే వుంది.
తక్కువ సినిమాలతోనే స్టార్ అయ్యారు కదా .. ఎలా అనిపిస్తింది ?
-స్టార్ గురించి పట్టించుకోను. ఇంకా ఎదగాలి. ఇంకా మంచి సినిమాలు చేయాలి. ప్రేక్షకులకు నా పేరు గుర్తులేకపోయినా పర్లేదు కానీ నేను సీతగా, యష్ణగా.. ఇలానేను చేసిన పాత్రలతో గుర్తుండిపోవాలి. దాని కోసం నిజాయితీగా పని చేస్తా.
నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-ఈ విషయంలో నేను చాలా లక్కీ. దుల్కర్ విజయ్ ఇప్పుడు నాని.. నేను కలసి పని చేసిన హీరోలందరూ చాలా సపోర్టివ్. నానితో వర్క్ చేయడం మంచి అనుభూతి. నటన విషయంలో చాలా విలువైన సూచనలు ఇచ్చారు. తనతో కలసి నటించడంతో నటన మరింత ఎలివేట్ అయ్యిందని నా ఫీలింగ్
ఇందులో మీ పాత్ర గురించి చెప్పండి ?
– ఇందులో నాది న్యూ ఏజ్ అమ్మాయి పాత్ర. యష్ణ పాత్రలో అన్ని ఎమోషన్ వున్నాయి. చాలా లేయర్స్ వుంటాయి. ఇకపై యష్ణగా గుర్తుపెట్టుకుంటారనే నమ్మకం వుంది. హాయ్ నాన్న మానవ బంధాలని చాలా బలంగా చూపిస్తోంది.
హాయ్ నాన్న పై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు ?
ఒక ఆర్టిస్ట్ గా ఎలాంటి సినిమా చేస్తున్నామో మన మనసుకి తెలిసిపోతుంది. కథని పాత్రలని బలంగా నమ్మి అంతే నిజాయితీతో చేసిన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది.
హాయ్ నాన్నలో సవాల్ గా అనిపించిన మూమెంట్ ?
– ఇందులో ‘అమ్మాడి’ పాటలో పెర్ఫెక్ట్ గా లిప్ సింక్ చేయాలి. నేను ప్రొఫెషనల్ సింగర్ ని కాదు. ప్రతి పదాన్ని ట్యూన్ కి తగ్గట్టు లిప్ సింక్ చేయాలి. అది కాస్త సవాల్ గా అనిపించింది.
హిందీ వెబ్ సిరిస్ లు చేస్తున్నారు .. మరి తెలుగు ఎప్పుడు ?
– వెబ్ సిరిస్ అనేది లాంగర్ ఫార్మెట్. దానికి సమయంతో పాటు భాష లో కూడా కంఫర్ట్ వుండాలి. ప్రస్తుతానికి నా ద్రుష్టి తెలుగు సినిమాలపైనే వుంది. భవిష్యత్ లో మంచి కథ వస్తే అప్పుడు ఆలోచిస్తా.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
-ఫ్యామిలీ స్టార్ చేస్తున్నా. కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ వున్నాయి. తెలుగులో కథలు వింటున్నా.
ఆల్ ది బెస్ట్ అండీ
థాంక్స్ అండీ