ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి వారాంతంలో రాసే కామెంట్ ను ఈ సారి అదే పేరుతో వారం ప్రారంభంలోనే రాశారు. ఈ పలుకుల్లో ఆయన చేసిన నర్మగర్భమైన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను కలవరపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్పీని రెండుసార్లు విలీనం చేసుకున్న కేసీఆర్ ను.. కాంగ్రెస్ అంత వీజిగా వదిలి పెట్టదని చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం … కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉండదని ఆర్కే స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైపు పోయిన వారు పోగా మిగిలిన వారిని బీజేపీ చేర్చుకుంటుందని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణలో బేస్ వచ్చింది. ఉత్తర తెలంగాణలో గట్టిపోటీ ఇస్తోంది. బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీనే ఎక్కువగా కైవసం చేసుకుంది. అందుకే ఆర్కే పరోక్షంగా బీఆర్ఎస్ ను బలహీనం చేయకపోతే తాము బలపడలేమని. .. భావిస్తున్నారని అంటున్నారు. ఆ ఉద్దేశంతోనే మొదట బీఆర్ఎస్ ను బలహీనపరిచారని.. ఇప్పుడు తమ తర్వాత ప్లాన్ అమలు చేస్తారని అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ బీజేపీ రాజకీయాలను తట్టుకోలేరని అంటున్నారు. ప్రస్తుతం ప్రజలపై అలిగిన కేసీఆర్ ఇప్పుడల్లా పార్టీని పట్టించుకోరని ఆర్కే చెబుతున్నారు.
కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్త్యం లేదని ఆర్కే భావన. ఇప్పటి వరకూ అధికార పార్టీ నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఇంత వరకూ పని చేయలేదు. ఆయన పార్టీని నడపడం… రేవంత్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం చిన్న విషయం కాదని ఆర్కే భావన. అందులో నిజం ఉంది. బీజేపీకి తెలంగాణలో ఇప్పుడు గోల్డెన్ చాన్స్ లభిచింది. బీఆర్ఎస్ ను తన ప్రమేయం లేకుండా బలహీనడేలా చేయగలిగితే లబ్ది పొందేది బీజేపీనే. అందుకే రేవంత్ చేసే పనులకు బీజేపీ సపోర్ట్ చేయవచ్చుననేది ఆర్కే అంతర్లీనంగా చెప్పిన మాట.
మొత్తంమగా కేసీఆర్ గడ్డు ప రిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీని నిలుపుకోవడం చిన్న విషయం కాదు. ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఆయనేనని.. కుమార్తె అరెస్టు కాకుండా బీజేపీతో డీల్ కుదుర్చుకోకపోతే… పరిస్థితి వేరుగా ఉండేదని చెబుతున్నారు. మొత్తంగా ఆర్కే చెప్పేదమిటంటే.. కేసీఆర్ తన నెత్తి మీద తాను చేయి పట్టుకున్నారు.