ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ రెడ్డి వేసే డ్రామాలు ఎలా ఉంటాయో ప్రజలకు క్లారిటీగా ఉందని నాగార్జున సాగర్ డ్యాం విషయంలో ప్రజలు అసలు స్పందించకపోవడాన్ని చూస్తే అర్థమైపోతుందని రాజకీయవర్గాలు క్లారిటీకీ వస్తున్నాయి. తమ మిత్రుడు బీఆర్ఎస్ కు.. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గడ్డు పరిస్థితులు ఉన్నాయని తేలగానే రాత్రికి రాత్రే డ్యాం మీదకు ఆక్రమణకు పోలీసుల్ని పంపి సెటిమెంట్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కానీ అటు ఏపీ ప్రజలు కానీ ఇటు తెలంగాణ ప్రజలు కానీ పెద్దగా స్పందించలేదు. ఇలాంటి రాజకీయాలు చాలా చూశామని లైట్ తీసుకున్నారు.
ఎన్నికలు ముగియగానే.. జగన్ రెడ్డి డ్యాంను ఖాళీ చేసేశారు. అయితే ఈ రాజకీయం వల్ల జరిగిందేమిటంటే… సాగర్ డ్యాం కేంద్రం అధీనంలోకి వెళ్లడం. పోతే పోయిందిలే.. ఇప్పుడు దాన్ని అట్టిపెట్టుకుని మాత్రం సాధించేదేమి ఏముందన్నది .. ఏపీ సర్కార్ ప్లాన్. అది కూడా నిజమే. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ… డ్యాంపై పదమూడుగేట్లు మావేనని అనలేదు. ఇప్పుడు నీళ్లు లేని సమయంమలో దౌర్జన్యం చేశారు. కృష్ణాబోర్డు దగ్గర తప్పుడు ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రజల్లోనూ పలుచన అయ్యారు.
వచ్చే నాలుగు నెలల్లో జగన్ రెడ్డి వైపు నుంచి ఎక్స్ ట్రీమ్ డ్రామాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతుంది. చివరికి హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి తరహాలో గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించే అవకాశాలనూ కొట్టి పారేయలేమని భావిస్తున్నారు. తనను ఓడిస్తే.. బతకనియ్యరని.. ఇప్పటికే హెచ్చరికలను టీడీపీ నేతలు చేశారని ఏడ్చినా ఆశ్చర్యం లేదని భావిస్తున్నారు. జగన్ రెడ్డి రాజకీయాన్ని చూస్తే.. ఏదైనా జరగొచ్చని .. కానీ ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.