బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నిక అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘భవిష్యత్’ అవసరాల దృష్ట్యా కేటీఆర్‌కు అసెంబ్లీలో బీఆర్ఎస్ లీడర్‌గా అవకాశమివ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులతో ఇప్పటికే చర్చించారు. వారందరూ కేసీఆర్ ప్రతిపాదనకు అంగీకరించారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి…ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు. దాంతో ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దకక్కుతోం. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పై పోరాటం చేసి… గెలిపిస్తే… సులువుగా సీఎం అయ్యే చాన్స ఉంటుంది. ట్రబుల్ షూటర్ హరీశ్‌రావుకు ఎల్పీ లీడర్‌గా అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ… భవిష్యత్ కారణాల రీత్యా ఆయనకు ఆ అవకాశం రాకపోవచ్చని చెబుతున్నారు. నూటికి నూరు శాతం కేటీఆరే శాసనసభాపక్ష నేత అవుతారు. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రావు. ఒకవేళ వస్తే… కేటీఆర్, హరీశ్ కాకుండా ఇంకెవరికైనా సీనియర్‌కు ఆ పదవి దక్కే అవకాశం ఉండొచ్చని బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.
పదేళ్ల నుంచి సీఎంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు సాధారణ ఎల్పీ లీడర్‌గా ఉండటానికి ఇష్టపడటం లేదు. రేవంత్ అంటే మొదటి నుంచి కేసీఆర్‌కు పడదు. ఆయన ముఖం కూడా చూడటానికి మాజీ సీఎం ఇష్టపడరనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాల రీత్యా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవచ్చనీ, అందుకే కేటీఆర్‌ను రంగంలోకి దించబోతున్నారని అంటున్నారు.