పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలతో హైకోర్టులో దడదడలాడిస్తున్నారు. కాకపోతే ఆ కేసులన్నీ తేలిపోతున్నాయి అసలు సాక్ష్యాలు.. వాదనలు గట్టిగా వినిపించకుండా.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చేయమని ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా వాదనలు వినిపించే శైలిపై ఇప్పటికే హైకోర్టు లాయర్లు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. తాజాగా… ఇంజినీరింగ్ కాలేజీ ఫీజుల అంశాన్ని సమర్థించుకుంటూ ఆయన చేసిన వాదనల్ని హైకోర్టు తిరస్కరించింది. దీతో ప్రభుత్వం పరువు పోయిటన్లయింది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక.. ఫీజు రీఎంబర్స్ మెంట్ అందరికీ ఇస్తానని ప్రకటించారు. బాగానే ఉంది కానీ.. ఆ ఫీజుల్ని భారీగా తగ్గించేశారు. ఈ రోజుల్లో ఎల్కేజీ పిల్లలకు కూడా రూ. 30వేల ఫీజు వసూలు చేస్తారు.
కానీ జగన్ రెడ్డి మాత్రం రూ 35వేలు ఇంజినీరింగ్ ఫీజు నిర్ణయించారు. అత్యున్నత ప్రమాణాలు ఉన్న కాలేజీలకు కొంత ఎక్కువ ఖరారు చేయించారు. ఇందు కోసం తాము చెప్పినట్లుగా నివేదిక ఇచ్చే కమిషన్ ను నియమించారు. అయితే కాలేజీలన్నీ హైకోర్టుకు వెళ్లాయి. గతంలో కనీస ఫీజును రూ. 43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయి ఉత్తర్వుల ఇచ్చింది. ప్రభుత్వంపై ఫీజుల భారం తగ్గించుకోవడానికి కమిషన్ ఇలాంటి నివేదికను చట్ట వ్యతిరేకంగా ఇచ్చిందని హైకోర్టు నిర్ధారించింది.
ఇంజనీరింగ్ కళాశాలల ఖర్చులలో భాగంగా కమిషన్ విధించిన పరిమితులు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసమే ఇలాంటి చట్ట వ్యతిరేక ప్రక్రియను చేసిందని న్యాయస్థానం పేర్కొంది. కమిషన్ చట్ట ప్రకారంగా తిరిగి ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.