ప్రభుత్వం ఐదేళ్ల కాలానికే ఏర్పడుతుంది. అధికారులు శాశ్వతం. కానీ ఈలాజిక్ ను మర్చిపోతున్న అధికారులు తాత్కలిక పోస్టింగ్ ల కోసం… అధికారంలో ఉన్న వారు చెప్పినట్లుగా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి రేవంత్ రెడ్డిపై ఎన్నో జరిగాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నారు. అలాంటి వారికి కొత్త టెన్షన్ ప్రారంభమయింది.
పోలీసులకు… కాంగ్రెస్ గెలుస్తుందని తెలియగానే.. టెన్షన్ ప్రారంభమయింది. ట్రెండ్స్ ఊగిసలాడుతున్న సమయంలోనే డీజీపీ సహా అన్నతాధికారులంతా వెళ్లి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ఈసీ ఆగ్రహిస్తుందని తెలిసి కూడా వారు తగ్గలేదు. అనుకున్నట్లుగానే డీజీపీని సస్పెండ్ చేశారు. అయినా ఆయన ఫీల్ కావట్లేదు. ఎందుకంటే రేవంత్ కోసం సస్పెండ్ అయ్యానని తర్వాత గుర్తు పెట్టుకుంటారని ఆయన భావన. కానీ రేవంత్ డీజీపీ అంజనీకుమార్ ను మరో విధంగా గుర్తు పెట్టుకుంటారు. వారు తనపై చేసిన అట్రాసిటీస్ ను రేవంత్ అంత తేలికగా ఎలా మర్చిపోతారు..?
ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్న పోలీసుల అధికారులంతా కేసీఆర్ కు.. కేటీఆర్కు సన్నిహితులే. అందుకే సీఎం అయిన తర్వాత ప్రక్షాళన ఖాయంగానే జరుగుతుంది. కొత్త డీజీపీ, ఇంటలిజెన్స్ అధికారులను ఏర్పాటు చేసుకోనున్నారు. తనపై కుట్రలు చేసిన అధికారుల కు గుడ్డు పరిస్థితి కల్పించడం ఖాయమనుకోవచ్చు. అందుకే కొంత మంది ముందుగానే రాజీనామా చేశారు.