అధికారంలో ఉన్నాము… అధికారంలోకి వస్తాము మేము ఏమి చేసినా చెల్లుతుందనుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. తెలంగాణ నేతల మీద ఫేకులు చేస్తే ఇక్కడి పోలీసులు చూసుకుంటారు. అది రాజకీయంగా విమర్శలు చేయడానికి పనికి వస్తుంది. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన అత్యుత్సాహం వల్ల.. కర్ణాటక పోలీసుల గుప్పిట్లో ఇరుక్కున్నారు. ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి కర్ణాటక కాంగ్రెస్ ను అక్కడి ప్రభుత్వాన్ని బూచిగా చూపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. అక్కడేమీ జరగడం లేదని.. హామీలు అమలు చేయడం లేదని.. కరెంట్ ఇవ్వడం లేదని ప్రచారం చేసింది. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ వస్తే ఐటీ పరిశ్రమను బెంగళూరు తరలిస్తారని కూడా వాదించారు. ఇందు కోసం ఫేక్ లెటర్లు తయారు చేశారు. ఫేక్ వీడియోలు సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతోనే ఓ ఫేక్ లెటర్.. ప్రియాంక్ ఖర్గే వాయిస్ తో కాంగ్రెస్ గెలిస్తే కర్ణాటక కరెంట్ తీసుకెళ్లిపోతామని మరో వీడియో రెడీ చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా వాటిని వైరల్ చేయడంతో కర్ణాటకలో డీకే శివకుమార్, ప్రియాంక్ ఖర్గే కేసులు పెట్టారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఐటీ సెల్ నడిపే తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ చూసేవ్యక్తిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా అండగ్రౌండ్ కు వెళ్లిపోతోంది. ఇప్పుడు వారిని కాపాడటం చాలా కష్టమన్న వాదన కూడా ఉంది. అధికారం ఉందని ఎలా పడితే అలా చేసినందుకు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు . బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎంత యాక్టివ్ గా ఉంటే… అంత త్వరగా వారు బయటకు వస్తారు. లేకపోతే సర్వం కోల్పోవాల్సిందే.