తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ని ఇంట్లోని బాత్ రూమ్ లో అర్థరాత్రి జారిడటంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎడమకాలి కి గాయం అయిందని.. పడిన తర్వాత లేచి నిలబడలేకపోవడంతో వెంటనే యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆయన తుంటి విరిగినట్లుగా భావిస్తున్నారు. యశోదా వైద్యులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనూ ఢిల్లీలో ఓ సారి బాత్ రూంలో జారి పడ్డారు. అప్పట్లో ఆయనకు తుంటి ఆపరేషన్ జరిగింది. మరోసారి ఇలాంటి ప్రమాదమే జరగడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత గవర్నర్ కు రాజీనామా సమర్పించిన కేసీఆర్ అప్పట్నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు ఉంటున్నారు.
కేసీఆర్ కు మద్దతు తెలిపేందుకు ప్రజలు ఎర్రవెల్లికే వెళ్తున్నారు. శనివారం ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే ప్రమాదం జరగడం తో ఆయన అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రమాద తీవ్రత ఎంత అనేదానిపై యశోదా వైద్యులు ఏ క్షణమైనా ప్రకటన చేసే అవకాశం ఉంది.