ఎప్పుడో… ‘కింగ్’ కోసం నాగార్జునతో జోడీ కట్టింది త్రిష. ఆ తరవాత.. వీరిద్దరి కాంబోని చూసే ఛాన్సే రాలేదు. త్రిష కూడా తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమాలపై త్రిష దృష్టి పెడుతోంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రంలో త్రిష కథానాయికగా నటించడానికి ఒప్పుకొంది. వశిష్ట దర్శకుడు. ఇప్పుడు తెలుగులో మరో చిత్రానికి త్రిష సంతకాలు చేసినట్టు టాక్.
నాగార్జున కథానాయకుడిగా అనిల్ అనే తమిళ దర్శకుడితో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘లవ్ – యాక్షన్ – రొమాన్స్’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా త్రిషని ఎంచుకొన్నారని తెలుస్తోంది. నాగ్ ప్రస్తుతం ‘నాసామి రంగ’తో బిజీగా ఉన్నాడు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆ తరవాతే… ‘లవ్ – యాక్షన్ – రొమాన్స్’ సెట్స్‌పైకి వెళ్తుంది. శేఖర్ కమ్ముల- ధనుష్ కాంబోలో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.