ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. అమరావతికే అన్నిపార్టీలు మద్దతు ప్రకటించి భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నాయి. డిసెంబర్ 27వ తేదీన అమరావతి రైతుల ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్శిటీ ఎదుట భారీ సభను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలూ హాజరవుతున్నారు. ఒక్క వైసీపీ నేతలు మాత్రం హాజరు కారు. రాజధానికి మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు కూడా హాజరవుతారు. యునానిమస్ గా రాజధానికి సపోర్ట్ చేస్తారు. నిజానికి మీరంతా ముందు నుంచీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అందరూ కలిసి బ హిరంగసభ పెట్టడం మత్రం రాజకీయాల్లో కీలక మలుపు.
ఆంధ్రప్రదేశ్ ను దక్షిణాఫ్రికా చేయాలని జగన్ రెడ్డి నాలుగేళ్ల కిందట డిసెంబర్ 17వ తేదీన డిసైడయ్యారు. అక్కడ మూడు రాజధానులు ఉన్నాయి కాబట్టి ఏపీలోనూ మూడురాజధానులు కడతానని బయలుదేరారు. మామూలుగా అయితే ఎవరూ అపోజ్ చేయరు. జగన్ రెడ్డి లక్ష్యం అమరావతిని నాశనం చేయడం. అమరావతికి భూములిచ్చిన రైతుల్ని నాశనం చేయడం. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లుగా ఆయన చేసిన రాజకీయంతో రచ్చ ప్రారంభమయింది. నిజంగా మూడు రాజధానులు చేయాలనుకుంటే.. అమరావతి రైతులకు పరిహారం ఇచ్చి ఆపని చేసేవారు. వారికి అన్యాయం చేయడామే లక్ష్యంగా చట్టాలుచేస్తే.. ప్రజాస్వామ్యం ఊరుకుంటుందా ?
జగన్ రెడ్డి తప్పుడు పనులు చేస్తున్నట్లుగా తేలిపోయింది. నాలుగేళ్లుగా రాజధానిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయించలేకపోయారు. ఈ విషయంలో ఆయన ఓడిపోయారు. కానీ అధికారం ఉందని… తాను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ రైతులు నిరంతరాయంగా పోరాడుతున్నారు. వారిపై జగన్ రెడ్డి పోలీసులు ఎంత రాజ్యహింసకు పాల్పడినా వారు తగ్గలేదు. కేసుల విస్ఫోటం వారిపై పడింది. అయినా పోరాడుతున్నారు. మనో వ్యధతో ఎంతో మంది చనిపోయారు. అయినా ప్రపంచంలో సులువుగా ఏ అద్భుతమూ జరగలేదు… అద్భుతమైన పోరాటాల తర్వాతే… అద్భతాలు జరిగాయి. అమరావతి కూడా అలాంటిదేనని.. రైతుల పోరాటం నిరూపిస్తోంది.
మూడు రాజధానుల ఫార్ములా అత్యంత పనికి మాలినదని.. పైగా అందులో నిజాయితీ లేదని ఇప్పటికే అందరూ ఓ క్లారిటీకి వచ్చారు. ప్రజలకూ స్పష్టత వచ్చింది. అందుకే వైసీపీకి ఎక్కడా మద్దతు లభించడం లేదు. ఆ విషయం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోయింది.