రాజకీయంగా విబేధించేవాడు అయితే చాలు వాడ్ని చంపాలన్నంతగా వ్యక్తిగత కక్షలను రాజకీయాలకు అంటించిన జగన్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరో వైపు సీఎం అయిన రేవంత్ రెడ్డి భిన్నమైన వ్యవహారశైలితో ఆశ్చర్చపరుస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆయనను పెట్టిన బాధతలు అన్నీ ఇన్నీ కావు. కుమార్తె పెళ్లి కోసం పన్నెండు గంటల బెయిల్ పై రావాల్సిన దుస్థితిని ఆయనకు కల్పించారు. ఎన్ని సార్లు జైలుకు పంపారో… చెప్పాల్సిన పని లేదు. అయినా సీఎం అయిన తర్వాత పగ తీర్చుకోవాలని అనుకోలేదు.. జారి పడితే బాగా అయిందని వెకిలి నవ్వులు నవ్వలేదు. మనస్ఫూర్తిగా పరామర్శించారు. కోలుకోవాలని కోరుకున్నారు.
రాజకీయానికే ఓ మరక జగన్ రెడ్డి మనస్థత్వం
భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు కనీసం సంతాపం తెలిపేందుకు తాను కానీ.. తన పార్టీ సభ్యులు కానీ శాసనసభకు హాజరయ్యేందుుకు సిద్ధపడలేదు జగన్ రెడ్డి. ఫ్లైట్ ఆలస్యం పేరుతో తాను రాలేదు… తాను రానందున మీరెవరూ వెళ్లవద్దని మిగతా ఎమ్మెల్యేలను ఆపేశారు. మనుషులు ఇలా రాక్షసంగా ఉంటారా.. చనిపోయిన వారిపైనా పగతో రగిలిపోతారా అని జనం అప్పుడే అనుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఘటనల్లో ఆ రాక్షసత్వం కనిపించింది. అరకు ఎమ్మెల్యేను నక్సలైట్లు కాల్చి చంపితే.. పార్టీని వీడపోయిన వారికి అలా జరగాల్సిందే అన్నట్లుగా స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఈ రాక్షసత్వం చూసి.. చాలా మంది భయపడ్డారు. మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నారు. ఇక సీఎం అయిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా ప్రకటించుకుని పోలీసుల సాయంతో ఎలాంటి అరాచకం చేస్తున్నారో కళ్ల ముందే కనిపిస్తోంది.
ప్రత్యేక ముద్ర వేస్తున్న రేవంత్ రెడ్డి
ఏపీలో జగన్ రెడ్డి తీరును చూసిన వారు రేవంత్ సీఎం అయితే… అంతే చేస్తారా అని భయపడ్డారు. అందుకే.. తెలంగాణ కూడా ఏపీ అవుతుందా అని కంగారు పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి చేతలతోనే అలాంటి భయాలు పెట్టుకోవద్దని సందేశం పంపారు. ప్రతిపక్ష నేతగా వంద చెబుతాం..చాలెంజ్ లు చేస్తాం కానీ అధికారపక్ష నేతగా.. సీఎంగా బాధ్యతగా..హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని తాను ఆ గౌరవాన్ని తగ్గించనని చూపిస్తున్నారు.
జగన్ రెడ్డి ఓ అరాచక బెంచ్ మార్క్ సృష్టించడం వల్లే రేవంత్ కు పేరు
సాధారణంగా ప్రతిపక్ష నేత అనారోగ్యానికి గురైతే పరార్శించడం కామన్. అది నైస్ గెశ్చర్ గా పొగడాల్సిన అంశం కాదు. ప్రజాస్వామ్య సంప్రదాయం. కానీ జగన రెడ్డి అనే నాయకుడు పక్క రాష్ట్రంలో చేసిన నిర్వాకాల వల్ల…. రేవంత్ రెడ్డి అలా చేయడం చాలా గొప్పగా ప్రచారంలోకి వస్తోంది. రాజకీయాల్ని .. ప్రజలు ఇచ్చిన అధికారాల్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్న వైనం కళ్ల ముందు కనిపిస్తూంటే.. అలా చేయకుండా పద్దతిగా వెళ్తున్న రేవంత్ ను చూసి అందరూ ఆహా.. ఓహో అంటున్నారు.