ప్రభాస్ – మారుతి కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. అయితే సంజూ భాయ్ ఇప్పటి వరకూ సెట్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈనెలలోనే ప్రభాస్ సినిమా సెట్లో సంజయ్ దత్ అడుగు పెట్టబబోతున్నాడు. ఈనెల 18 నుంచి.. సంజయ్ దత్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేడు. ప్రభాస్ లేని కాంబినేషన్ సీన్లన్నీ సంజూతో పూర్తి చేస్తారు. సంక్రాంతి తరవాత.. ప్రభాస్ మారుతి సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. అప్పుడు మళ్లీ.. సంజయ్‌దత్ తో కాంబినేషన్ సీన్లని పూర్తి చేస్తారు. మారుతి సినిమా టైటిల్ ఏమిటన్నది ఇప్పటి వరకూ తేలలేదు. కొన్ని టైటిళ్లు పరిశీలనలో ఉన్నా – టీమ్ ప్రకటించడం లేదు. సలార్ హడావుడి అయిపోయిన తరవాత… మారుతి సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. 2024 చివర్లో మారుతి సినిమా విడుదల అవుతుంది.