సినిమా బావుంటే అభినందించడం సహజమే. అయితే అభినందనల్లో కూడా రకాలు వుంటాయి. సాధారణంగా సినిమా నచ్చితే.. ”అద్భుతమైన చిత్రం. టీం అందరికీ అభినందనలు’ అని ట్వీట్ చేసి ఎదో మొక్కుబడికగా కానించే అభినందనలే ఎక్కుగా కనిపిస్తాయి. అయితే అల్లు అర్జున్ మాత్రం ‘హాయ్ నాన్న’ చిత్రానికి ఇచ్చిన అభినందన మాత్రం కాస్త భిన్నంగానే వుంది. దాదాపు మినీసైజ్ పాజిటివ్ రివ్యూలా పేరుపేరునా అందరినీ అభినందించారు అల్లు అర్జున్.
”హాయ్ నాన్న మొత్తం టీమ్‌కి అభినందనలు. చాలా ఆహ్లాదకరమైన చిత్రమిది. మనసుని హత్తుకుంది. బ్రదర్ నాని అద్భుతంగా నటించాడు. ఇలాంటి మంచి కథ చేసినందుకు తనపై గౌరవం పెరిగింది. మృణాల్ నటన వెంటాడింది. తనలానే అందంగా ఉంది. బేబీకియారా.. క్యూట్‌నెస్‌తో మనసుని హత్తుకుంది. మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్‌లను చక్కని పని తీరు కనబరిచారు. కెమరామ్యాన్, సంగీత దర్శకుడు కట్టిపడేశారు. దర్శకుడు శౌర్యువ్ కి అభినందనలు. తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. కన్నీరు తెప్పించే మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. అద్భుతమైన ప్రెజెంటేషన్. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. హాయ్ నాన్న ప్రతి కుటుంబ సభ్యుల మనసుని హత్తుకుంటుంది” ఇలా చాలా వివరంగా ఒక రివ్యూ రాస్తున్నట్లు ప్రతి విభాగాన్ని ప్రస్తావిస్తూ మెచ్చుకున్నారు బన్నీ.