మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేసినా చేయకపోయినా అసలు విషయమే కాదు. ఎందుకంటే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కానీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే ఇక్కడ విశేషం. ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పార్టీలో క్యాష్ వ్యవహారాలను చూసే అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరైన ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సోదరుడు కూడా. అలాంటిది ఆయన పార్టీకి రాజీనామా చేయడం అంటే ఖచ్చితంగా వ్యూహాత్మకమే అని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆళ్లకు టిక్కెట్ ఇవ్వరని ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఆ విషయం ఆళ్లకు కూడా తెలుసు. మరి ఇప్పుడు పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారన్నది కీలకం. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉండబోతోందన్నదానిపై వైసీపీ నేతలకు క్లారిటీ వస్తోంది. ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటన్నదానిపై వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా టీడీపీ హిట్ లిస్ట్ లో ఉంటాడు. సీఐడీకి తప్పుడు కేసుల వ్యూహంలో ఆయన భాగస్వామి.
అంతే కాదు.. అమరావతిపై విషం కక్కడంలోనూ.. న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంలోనూ ఆయన ముందుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య ఓ అధికారికి బినామీగా ఉంటూ ఆస్తులు కూడబెట్టారు ఆ కేసు కూడా ఉంది. మొత్తంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి భవిష్యత్ భయంతోనే రాజీనామా చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డికి దగ్గరగా ఉండే వారికే ఇలాంటి పరిస్థితి ఎదురయితే.. ఇతరుల సంగతేమిటన్న దానిపై వైసీపీలో చర్చ జరుగుతోంది. కనీసం సేఫ్ గా అయినా ఉండాలంటే.. ేదో ఓ మార్గం చూసుకోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.