తెలుగు రాష్ట్రాల్లో బడా కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం రాత్రి కలిశారు. జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఏ అంశాలపై చర్చించారో తెలియదకు కానీ.. సీఎంగా బాధ్యతలు చేపట్టినందుంకు అభినందించడనికే కలిశారని మేఘా వర్గాలు చెబుతున్నాయి. మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ తో పాటు ఏపీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడు. తెలంగాణలో మేజర్ కాంట్రాక్టులన్నీ ఆ సంస్థకే దక్కుతాయి.
లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను మేఘా చెపడుతోంది. ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్, వైసీపీ కాంట్రాక్టర్లకు సబ్ కాంట్రాక్టులు దక్కుతాయి. అందుకే రేవంత్ రెడ్డి చాలా సార్లు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రజల సొమ్ము దోచి పెడుతున్నారని ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. ఒక్క కాంట్రాక్టులే కాకుండా.. ఒలెక్ట్రా విద్యుత్ బస్సులు సలహా అనేక వ్యాపారాలను.. మేఘా సంస్త నిర్వహిస్తోంది.
ప్రభుత్వ కాంట్రాక్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ అవినీతి..కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని గతంలో ప్రకటించారు. రాహుల్ గాంధీ కూడా చెప్పారు. అవినీతి సొమ్మును అంతా కక్కించి ప్రజలకు పంచుతామని.. రాహుల్ గాంధీ కూడా ప్రకంటించారు. ఈ అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై తెలంగాణ వర్గాల్లో ఆసక్తి ఏర్పడుతోంది.