జగన్ రెడ్డి క్షుద్ర రాజకీయానికి ఇప్పుడు రెడ్డి వర్గం బలవుతోంది. తన ప్రభుత్వంపై వ్యతిరేకతకు రెడ్డి వర్గమే కారణమని వారిని నిలువునా తొలగిస్తున్నానని సంకేతాలు పంపేందుకు జగన్ రెడ్డి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో కమ్మ వ్యతిరేకతను పెంచారు. మంచి ఫలితాలను సాదించారు. ఈ సారి రెడ్డి వర్గంపై ప్రజల్లో అలాంటి వ్యతిరేకతను పెంచి… ఇతర వర్గాల్లో మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్ల వర్గ నేతలను బ లి చేయడం ద్వారా… ఆ వర్గం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసిందని.. తాను మాత్రం ఆ వర్గానికి దూరంగా ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తన ఉన్నతికి కారణం అయినా రెడ్డి వర్గం నేతల్ని జగన్ రెడ్డి గత రెండేళ్లుగా వ్యహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి , ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాకనుంచి వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి..
ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి దూరమవుతున్నారు. అధికార పార్టీకి వీరంతా దూరమవడం ఒక విశేషం అయితే, వీరందరూ సీఎం జగన్ సొంత సామాజిక వర్గం నేతలు. ఎందుకు వీరిని ప క్కన పెట్టేస్తున్నారని.. వారి దగ్గర ఉన్న రసం అంతా పిండుకున్నారు. ఇక వదిలించుకోవడమే తరువాయి అన్న సమయంలో వారు బయటపడిపోయారు.కొంత మంది ముందుగానే విషయం తెలుసుకుని బయటపడుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి సొంత సామాజికవర్గానికి మేలు చేశారని ఆ వర్గం కూడా అనుకోవడం లేదు. చాలా కొద్ది మందిని చేరదీసి.. వారికే పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు ఇచ్చి బినామీలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ.. నిజంగా సొంత సామాజికవర్గాన్నీ ఆయన బాగు చేసింది లేదని.. ఆ సామాజికవర్గంలో చాలా మంది నేతల్ని ఆర్థికంగా కుంగదీశారని అంటున్నారు. ఇప్పుడు అలాంంటి నేతల్ని రాజకీయానికీ దూరం చేస్తున్నారు. వారిని ప్రజల ముందు విలన్లుగా పెట్టి తాను సానుభూతి పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
నమ్మి నట్టేట మునిగుతున్నట్లుగా రెడ్డి సామాజికవర్గానికి ఓ క్లారిటీ ఇప్పుడిప్పుడే వస్తోంది. బీసీలను ఆకట్టుకోవడానికి తమను విలన్లుగా చేయడం ఏమిటన్న అసంతృప్తి వారిలో కనిపిస్తోంది.