నందమూరి కల్యాణ్‌రామ్ ‘డెవిల్’ ట్రైలర్ బయటికి వచ్చింది. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ గా కళ్యాణ్ రామ్ ని పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం వింటేజ్ యాక్షన్, పీరియాడికల్ స్పై థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సాగింది. మామూలు ఒక మర్డర్ కేసు పరిశోధనగా కథని పరిచయం చేస్తూ… తర్వాత చరిత్ర, బ్రిటిష్ ప్రభుత్వం, తిరుగుబాటు.. ఇలా కీలకమైన అంశాలని ఆసక్తిరేపేలా చూపించారు.
కళ్యాణ్ రామ్ లుక్, యాక్షన్ బావుంది. ‘విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కని అనుకున్నావా.. లయన్’. ‘శవాలు సాక్ష్యం చెప్పడం ఎప్పుడైనా చూశావా” అంటూ డెవిల్ పాత్ర చెప్పిన డైలాగులు బావున్నాయి. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
విజువల్, నేపధ్య సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. డెవిల్ ట్రైలర్ చూస్తుంటే.. రెగ్యులర్ స్పై సినిమాల భిన్నంగా కనిపిస్తోంది. నేర పరిశోధన, బ్రిటిష్ సామ్రజ్యం .. ఈ సెటప్ కొత్తదనం తీసుకొచ్చింది. అభిషేక్ నామా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆయనే. ఈ సినిమా ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది.