ఆంధ్రప్రదేశ్లో జీ హుజూర్ పోలీసులు కాకపోతే వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో… త్రిపాఠి ఉజేలా అనే పోలీసు ఆఫీసర్ ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఏపీ పోలీసుల్లో డీజీపీకి ముందు ఉండే క్యాడర్ అదనపు డీజీ. సీఎం జగన్ రెడ్డికి నచ్చితే అదనపు డీజీల్లో సీఐడీ చీఫ్లు.. ఏసీబీ చీఫ్లు.. ఇంటలిజెన్స్ చీఫ్లు అవుతారు. ఒక వేళ ప్రభుత్వం చెప్పినట్లుగా చేయకపోతే వారి పరిస్థితి హోంగార్డు కన్నా ఘోరంగా ఉండటం కాదు.. తప్పుడు కేసులు పెట్టి బొక్కలో వేసేయగలరు కూడా. దానికి త్రిపాఠి ఉజేలానే సాక్ష్యం.
ఏపీలో అదనపు డీజీగా ఉన్న త్రిపాఠి ఉజెలా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల కిందట కడప నుంచి ఓ వ్యక్తి వచ్చి మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంగార్డు ఉద్యోగమో… మరొకటో ఇస్తామని కొంత మంది డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆ ఫిర్యాదు సారాంశం. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులే త్రిపాఠి ఉజెలా పేరు లేదు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇద్దర్ని అరెస్టు చేశారు. వారు చెప్పారంటూ… త్రిపాఠి ఇంటికి పోలీసులు వెళ్తున్నారు.
తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని తేలడంతో ఉజేలా త్రిపాఠి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసులో మంగళగిరి పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇలాంటి కేసుల్లో అసలు వివరాలు ఇవ్వకుండా వాయిదాలు కోరుతూ ఉంటారు న్యాయవాదులు. పోలీస్ అధికారిని అరెస్టు చేస్తే సస్పెండ్ అవుతారు. అదే కుట్ర అని ఏడీజీ అనుమానం.
పోలీసుల్లో ఇదంతా ఎందుకు జరుగుతుంది.. అసలు పోలీసు వ్యవస్థ ఇంత చిల్లరగా ఎలా మారిందనేది చాలా మందిక ఆశ్చర్యకరమైన విషయమే. కానీ పాలకుడ్ని బట్టే అన్ని వ్యవస్థలు ఉంటాయి.