దేశ అత్యున్నత చట్ట సభ లోక్ సభకు భద్రత లేకుండా పోయింది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో ఓ ఆగంతకుడు విజిటర్స్ గ్యాలరీలోనుంచి నేరుగా సభలోకి దూకారు. తరవాత టియర్ గ్యాస్ ప్రయోగించారు. కలర్ స్మోక్ ప్రయోగించడంతో గందరగోళం ఏర్పడింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు సభలోనే ఉన్నారు. అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎంపీలకు చాలా సమయం పట్టింది. ఓ దండగుడు లోక్ సభపైనే దాడి చేసినట్లుగా గుర్తించారు.
22 ఏళ్ల కిందట పాకిస్తాన్ ఉగ్రవాదులు పార్లమెంట్ పై దాడి చేశారు. ఇదే రోజున ఆ దాడి జరగడంతో… ఇప్పుడు కూడా దుండగులు నేరుగా లోక్ సభలోకి ఎంటర్ కావడంతో సంచలనంగా మారింది. ఇది కూడా పాకిస్థాన్ వైపు నుంచి జరిగిన కుట్రేనా అన్న అనుమానాలు వ్యక్తవుతన్నాయి. ఓ యువకుడు, యువతి ఈ దాడికి ప్లాన్ చేసుకున్నారు. నీలం కౌర్, షిండే అనే ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు. తానా షాహీ బంద్ కరో.. జై భీమా.. భారత్ మాతాకీ జై అంటూ వారు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని..నియంతృత్వ చెల్లదని వారు నినాదాలు చేశారు. నిందితులు మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాసులతో విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు.
అసలు వీరు ఎందుకు ఇలాంటి పని చేశారన్నది తేలాల్సి ఉంది. వెంటనే విరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు పంపేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం స్పష్టంగా బయటపడటంతో.. ఎంపీలు పరుగులు పెట్టారు.