పిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన ఉందని జగన్ రెడ్డి గురించి ఎక్కువ మంది చెప్పే మాట. ఇప్పుడు తన పనితనం పార్టీ విషయంలోనూ చూపిస్తున్నారు. పదకొండు మంది ఇంచార్జుల మార్పుతో జగన్ రెడ్డి పార్టీని చిందర వందర చేస్తున్నారన్న సెటైర్లు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడంతో జగన్ రెడ్డిలో తెలియని వణుకు ప్రారంభమయిది. తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే అభ్యర్థులను మార్చిన చోట మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చాలని డిసైడయ్యారు. అనుకున్నదే తడవులుగా ఐ ప్యాక్ టీం ఇచ్చే సర్వే రిపోర్టులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంచార్జుల మార్పుపై దృష్టి సారించారు. కసరత్తు చేసి ప్రకటించిన 11 స్థానాల జాబితా చూసి టీడీపీ నేతలే ఫక్కున నవ్వుకుంటున్నారు.
అద్దంకి హనిమిరెడ్డి అనే నేతకు కేటాయించారు. ఆయన పెదకూరపాడుకు చెందిన వ్యక్తి. యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటానంటే ఇచ్చేశారు. గుంటూరు పశ్చిమలో విడదల రజనీకి ఏ సమీకరణం చూసి ఇచ్చారో కూడా వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. సొంత నియోజవకర్గాల్లో మంట పెట్టుకున్న మంత్రులకు ఇతర తోట్ల ఆదరణ ఎలా లభిస్తుదంన్న చిన్న లాజిక్ ను జగన ్రెడ్డి మిస్సయ్యారని అంటున్నారు
ఇది ప్రారంభమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వైసీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే ఇంచార్జుల్ని మార్చాలనుకున్న చోట శరవేగంగా మార్చేసి.. పనితీరున అంచనా వేయాలనుకుంటున్నారు. పరిస్థితుల్ని అంచనా వేసిన తర్వాత.. టిక్కెట్లను ఖరారు చేస్తారు. ఇంకా ఎక్కువ సమయం లేదని.. కేవలం రెండు నెలలే ఉన్నందున వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటే.. ఆశలు వదిలేసుకోవడం బెటరన్న అభిప్రాయంతో వైసీపీ నేతలు ఉన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం.. జగన్ రెడ్డి వ్యూహం ఆహో..ఓహో అని ప్రచారం చేసుకుంటున్నారు.