ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి నెలాఖరులో ఓ సారి ఢిల్లీకి వెళ్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మెడలు వంచడానికి వెళ్తారని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తూంటారు కానీ ఆయన ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి వ్యక్తిగత పనులు చక్క బెట్టుకుని వస్తూంటారని.. పనిలో పనిగా అప్పులకు అనుమతి తెచ్చుకుంటారని అంటున్నారు. గతంలో ఢిల్లీ పర్యటన సమయంలో డిసెంబర్ వరకూ అదనపు అప్పులకు పర్మిషన్ తెచ్చుకుని ఆర్బీఐ నుంచి నెలకు ఐదు వేల కోట్ల వరకూ అప్పులు తీసుకుంటున్నందదున ఈ సారి అవసరం రాలేదంటున్నారు.
మరో వైపు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. షర్మిల తో రాజీ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో జగన్ ఒకటి, రెండు సార్లు సీక్రెట్ గా సమావేశమయ్యారని ప్రచారం జరుగుతోంది. గతంలో యూరప్ పర్యటనలో రాహుల్ నూ కలిశారని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల యాక్టివ్ అయితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా తన పరిస్థితి అవుతుందని అలా చేయవద్దని విజ్ఞప్తి చేసినట్లుగా చెబుతున్నారు. అందుకే షర్మిల విషయంలో రాహుల్ ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు.
ఈ పరిణామాలతో బీజేపీ పెద్దలుకూడా జగన్ విషయంలో కాస్త దూరం పాటిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ మద్దతు లేకపోతే తమ పరిస్థితి ఘోరంగా ఉంటుందని తెలుసు కాబట్టి బ హిరంగంగా బీజేపీని మెప్పించేందుకు విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు.. పార్లమెంట్ లో నెహ్రూపై కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ డబుల్ గేమ్ ఢిల్లీలో నవ్వుల పాలవుతోంది.