పుంగనూరులో తాను తప్ప ఎవరూ రాజకీయం చేయకూడదని… మంత్రి పెద్ది రెడ్డి అనుకుంటారు. చివరికి ప్రధాన పార్టీ కాకపోయినా .. బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ తార్యక్రమాలన్నా భయపడుతున్నారు. సదుంలో ఆయన రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఇదేదో రాస్తారోకో.. ధర్నా అన్నట్లుగా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిైప బీసీవై నేత రామచంద్రయాదవ్ హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నారు. అయినా పోలీసులు మొండికేస్తున్నారు.
శుక్రవారం సదుంలో రామచంద్రయావ్ రైతు సదస్సును నిర్వహించి తీరుతానని ప్రకటించారు. హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా ఏదీ తేల్చి చెప్పలేదు. కానీ రామచంద్ర యాదవ్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. గతంలో ఇలాగే రైతు సదస్సును ఏర్పాటు చేస్తే.. పోలీసులు అనుమతి ఇవ్వకపోగా… రెండు వందల మంది పెద్దిరెడ్డి అనుచరులు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు పట్టించుకోలేదు.
అప్పట్లో రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టుకోలేదు. ఇప్పుడు కొత్త పార్టీతో రాజకీయం చేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించి తీరాలన్న పట్టదలతో .. దాడులకు తగ్గకుండా రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పోలీసులు కూడా పెద్దిరెడ్డికి ఏకపక్షంగా సహకరిస్తున్నారు.