టీఆర్ఎస్ అెధికారంలో ఉన్నప్పుడు తొడకొట్టి , రేవంత్ రెడ్డిపై చాలెంజులు, ఆరోపణలు చేసిన మల్లారెడ్డి ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పూర్తిగా మారిపోయారు. రేవంత్ రెడ్డి తనకు దోస్తని ప్రకటించుకుంటున్నారు. ఆయనపై మూడు రోజుల కిందట ఓ కబ్జా కేసు నమోదయింది. ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రవర్తన భిన్నంగా ఉంది. ఆయన తన అల్లుడితో కలిసి సైలెంట్ గా వచ్చి వెళ్తున్నారు. తనపై కేసులు కక్ష సాధింపులు కాదని ఆయన చెబుతున్నారు.
శుక్రవారం అసెంబ్లీ లాబీలో ఉన్న సమయంలో తీన్మార్ మల్లన్న ఎదురయ్యారు. తీన్మార్ మల్లన్న ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆయన కూడా మేడ్చల్ సీటు కోసం ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో వారి మధ్య సీటు సంభాషణ ముగిసిన తర్వాత.. మల్లారెడ్డిని.. కాంగ్రెస్ కు మద్దతిస్తావా అని అడిగారు తీన్మార్ మల్లన్న. అంతే సంకోచించకుండా.. అసెంబ్లీలో ఎప్పుడైనా కాంగ్రెస్కు సీట్లు తక్కువ అయితే మద్దతిస్తానని ప్రకటించేశారు మల్లారెడ్డి.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని.. తర్వాత కాదని చెప్పుకొచ్చారు. సొంత పార్టీకి కాకుండా.. అధికార పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పడం రాజకీయం ఎలా అవుతుందో కానీ.. మల్లారెడ్డి మాత్రం.. తన అల్లుడితో కలిసి..రేవంత్ పిలిచిన వెంటనే కాంగ్రెస్లో చేరిపోవడం ఖాయమన్న అభిప్రాయం బీఆర్ఎస్లో వినిపిస్తోంది