తెలుగు స్క్రైబ్ ట్విట్టర్ హ్యాండిల్ ను బీఆర్ఎస్ ఐటీ సెల్ తరపున హ్యాండిల్ చేసే రవికాంత శర్మ అనే బీఆర్ఎస్ కార్యకర్తను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కరెంట్ కోతలు, కరెంట్ అంశాలపై కర్ణాటక కీలక నేతల వాయిస్‌లను ఫేక్ చేసి.. ఎన్నికల సమయంలో అలజడి రేపే ప్రయత్నం చేశారు. దీనిపై కర్ణాటకలో కేసు నమోదయింది. ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా రవికాంత్ శర్మను అరెస్ట చేసి బెంగళూరు తీసుకు వెళ్లారు. రవికాంత శర్మ తల్లిదండ్రులు ఇద్దరూ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు. అందకే రవికాంత శర్మ కూడా.. ఐటీ విభాగంలో పని చేస్తున్నారు.
తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ను.. బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల పై ఎక్కువగా ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఈ ఖాతాపై అనేక విమర్శలు ఫిర్యాదులు ఉన్నప్పటికీ తెలంగాణలో నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున నడిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో పాలన మారింది. పైగా కర్ణాటక నేతలపై ఫేక్ చేశారు.
దాంతో వారు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. డీకే శివకుమార్ లెటర్ ఫేక్ చేసిన కేసు కూడా బెంగళూరులో నమోదయింది. ఆ కేసులో ఎవర్ని అదుపులోకి తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది. మరో వైపు సీఎం రేవంత్ రెడ్డిపై అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న ట్విట్టర్ హ్యాండిళ్లపైనా తెలంగాణ సైబర్ పోలీసులు దృష్టి కేంద్రకీరించినట్లుగా తెలుస్తోంది.