తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసిన డీఎస్పీ నళిని అప్పట్లో హాట్ టాపిక్ ఆమె ఉద్యోగం పోయింది.. మళ్లీ రోశయ్య హయాంలో వచ్చింది. కానీ రూల్స్ కు వ్యతిరేకం అని తేలడంతో మళ్లీ ఉద్యోగం పోయింది. తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. మధ్యలో బీజేపీలో చేరడంతో తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ కూడా పట్టించుకోలేదు. ఎలాంటి ఉద్యోగం ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో మరోసారి ఆమె అంశం వైరల్ అయింది. ఇది రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి.
నళీనికి మళ్లీ డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అది సాధ్యం కాకపోతే.. వేరే డిపార్టుమెంట్ లో అదే హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇవ్వాలన్నారు. అయితే డీఎస్పీ రెండు సార్లు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖలు రాశారు. తనకు ఏ ఉద్యోగం అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ ఉద్యం పేరుతో రాజీనామా చేసినందుకు తనకు ఎదురైన అవమానాల గురించి విపులంగా చెప్పుకొచ్చారు ఇంతా చెప్పిన తనకు ఉద్యోగం మాత్రం అవసరం లేదన్నారు.. ఎందుకంటే తానిప్పుడు సన్యాసినిగా మారిపోయారట. జీవితంలో సర్వస్వం కోల్పోయిన తాను.. ఇప్పుడు మరో మార్గం ఎంచుకున్నానని దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడని చెప్పుకొచ్చారు.
వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారని అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానన్నారు. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. ఉద్యోగం అవసరం లేదు కానీ ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాన్నారు. .ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిన్నారు. ‘వేదం యజ్ఞం’ పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నందుక ప్రస్తుతం కలవలేనని కూడా తన బహిరంగలేఖలో రేవంత్‌కు తెలిపారు.
మొత్తంగా.. నళిని రాస్తున్న లేఖలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. .