వివేకా హత్య కేసులో తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశారని వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించిన కడప కోర్టు.. వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లపై కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు చేయడం రెండో సారి.
సేమ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలలగానే.. కొంత మందికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యూఐసీఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్ రెడ్డి 2022 ఫిబ్రవరిలో కడప ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కేంద్ర దర్యాప్త సంస్థకు చెందిన అధికారి అదీ కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. తక్షణం అరెస్ట్ చేయగల సీరియస్ సెక్షన్లతో కేసు పెట్టారు. తర్వాత సీబీఐ ఆ కేసుపై హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్టే విధించింది కాబట్టి సరిపోయింది లేకపోతే అప్పట్లో సీబీఐ అధికారుల్ని కూడా ఏపీ పోలీసులు అరెస్టు చేసి ఉండేవారు.
గతంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణ హానీ ఉందని ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంత మంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పి కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు కేసులు నమోదు చేశారు. తర్వాత రాంసింగ్ దర్యాప్తు వద్దని సుప్రీంకోర్టుకే వెళ్లారు. అక్కడ సానుకూల ఫలితం పొందారు. ఇప్పుడు ఆ కేసు ఎటూ తేలకుండా మధ్యలో ఉండిపోయింది.