చాలా అంచనాలతో తెరముందుకు వచ్చింది నిహారిక. మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ ని మోయడం అంత ఈజీ కాదు. కానీ నిహారికమాత్రం తన పద్దతిలో సినిమా, వెబ్ సిరిస్ లు, టీవీ షోలు చేసుకుంటూ వెళ్ళింది. వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత తన కార్యచరణ ఏమిటనేది చెప్పలేదు. అయితే ఎట్టకేలకు ఆమె నుంచి సినిమా ప్రకటన వచ్చింది. ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది నిహారిక.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో జిగేల్ అనిపించే డ్రెస్ లో మెరిసింది. ఇందులో ఆమె అవతార్ ని చూసిన తర్వాత నిహారిక 2.0 అనాల్సిందే. ఇప్పటివరకూ నిహారిక తెరపై గ్లామర్ షో కి చాలా దూరం. ఆమె చేసిన తొలి చిత్రం ‘ఒక మనసు’లో అయితే నిండు చీరకట్టులో చాలా పద్దతిగా కనిపించింది. ఇప్పుడీ సినిమా లుక్ విషయానికి వస్తే పూర్తి మార్పు కనిపిస్తోంది. వరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ మంచు, వెన్నెల కిశోర్ లాంటి తారాగణం వుంది. క్రేజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాతో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి.