ఏపీలో వైసీపీ ఇంచార్జులమార్పు వ్యవహారం కామెడీ అయిపోతోంది. తమతో ఆపార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా బెదిరిస్తోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్పుకొచ్చారు. ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల వస్తారని.. ఇప్పుడు వైసీపీలో టిక్కెట్ నిరాకరించిన వారంతా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఆ విషయంలో ఎలాంటి సూచనలు కనిపించనప్పటికీ… ఏపీ పీసీసీ చీఫ్ మాత్రం … వైసీపీతకో మైండ్ గేమ్ ప్రారంభించారు.
షర్మిల కాంగ్రెస్ లోకి వస్తారని.. రేవంత్ రెడ్డి అండతో… పార్టీని బలోపేతం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. షర్మిల ఇంత వరకూ తాను ఏపీ రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా చెప్పలేదు. కనీసం ఆ దిశగా ఒక్క ప్రకటన కానీ.. పర్యటన కానీ చేయలేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపైనే స్పందిస్తున్నరు. కానీ తెలంగాణలో ఆమెకు రాజకీయ భవిష్యత్ లేదని ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతోనే తేలిపోయిందన్న విశ్లే,షణలు ఉన్నాయి. రాజకీయాల్లో కొనసాగలంటే… కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో రాజకీయం చేయడమేనని అంటున్నారు.
ఇప్పటికీ..ఈ అంశంపై షర్మిల తన అనుకూలతను వ్యక్తం చేయలేదు. మరో వైపు జగన్ మోహన్ రెడ్డి షర్మిల ఏపీలోకి వస్తే తన ఓటు బ్యాంక్ కు భారీగా గండి పడుతుందన్న అనుమానంతో.. ఆమె ఏపీలోకి రాకుండా… కొంత మంది మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.